top of page

ఎద్దుల పోటీలలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్.

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 19, 2022
  • 1 min read

చిత్తూరు జిల్లా, ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్తూరు జిల్లాలో పలుచోట్ల కన్నుల పండుగగా జరిగే కుంచిలి ఎద్దుల పోటీలు. చిత్తూరు నియోజకవర్గం, మండల ఎంపీపీ కె జయరామ్ పిలుపుమేరకు చెన్న సముద్రంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఎద్దుల పోటీలును ప్రారంభించి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు, అక్కడి స్థానిక వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున ఎమ్మెల్సి రమేష్ యాదవ్ కు బ్రహ్మరథం పట్టారు, ఈ కార్యక్రమంలో పొద్దుటూరు ఐదో వార్డ్ కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి, రాగం శ్రీధర్ పాల్గొన్నారు. స్థానికంగా వైసీపీ ఎంపీపీ లు కే.జయరామ్, కే.కుమార్, సర్పంచ్లు డి.ఎం జైపాల్, మునిరత్నం, వెంకటేష్ ,దేవేంద్ర, రామ్మూర్తి, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొనడం జరిగింది. వేలాదిగా పాల్గొన్న ప్రజలు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page