top of page

పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ సమావేశం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 25, 2023
  • 1 min read

Updated: Feb 26, 2023

పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ సమావేశం


పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ సమావేశంలో నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సమావేశంలో పాల్గొన్న ప్రొద్దుటూరు శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్. శనివారం కడప నగరంలోని ఆదిత్య కళ్యాణ మండపంలో నిర్వహించిన కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వెన్నపూస రవీంద్రరెడ్డి ని, అలాగే ఉపాధ్యాయ ఎమ్యెల్సీ కి పోటీ చేయుచున్న రామచంద్రారెడ్డి విజయానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అనుసరించాల్సిన విధి విధానాల గురించి దిశానిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్, మైనింగ్, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కె. సురేష్ బాబు, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page