top of page

ఎమ్మెల్సి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు తథ్యం - ఎమ్మెల్యే రాచమల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 5, 2023
  • 1 min read

వైసీపీ ఎమ్మెల్సి అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యతా ఓటు వేయాలని ఎమ్మెల్యే రాచమల్లు పిలుపు

కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు

వైఎస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


ఆదివారం ఉదయం స్థానిక శ్రీదేవి ఫంక్షన్ హాల్ నందు నియోజకవర్గ శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపి బలపరిచిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్యెల్సీ అభ్యర్థులు వెన్నపూస రవీంద్రారెడ్డి, ఎం.వి రామచంద్రా రెడ్డి లను మర్చి పదమూడవ తేదీన జరుగు ఎమ్యెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే రాచమల్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్యెల్సీ అభ్యర్థులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయులు కాస్త అసంతృప్తికి గురైన మాట వాస్తవమేనని, పలు సంక్షేమ పధకాల ద్వారా విద్యార్థులకు, నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని వారు అన్నారు. కార్యక్రమానికి పెద్దఎత్తున ఉపాధ్యాయ సంఘాల నేతలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు హాజరై వారి సంఘీభావాన్ని తెలియచేసారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page