top of page

రానున్న కాలంలో మరింత అభివృద్ధి - తిప్పల నాగిరెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 4, 2022
  • 1 min read

గాజువాక అభివృద్ధిలో స్థానిక జీవీఎంసీ 66వ వార్డు పరిధి ఇందిరాకాలనీలో ఎన్నో ఏళ్లుగా చుట్టుపక్కల ఉండే ప్రజలుకు వర్షాకాలం వస్తే డ్రైనేజి నిండిపోయి ఇళ్ళలోకి మురుగునీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశలో 66వ వార్డు వైస్సార్సీపీ కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ చొరవతో కల్వర్టుకి పునర్నిర్మాణ పనులకు శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి శంకుస్థాపన చేశారు..అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావాలంటే అందుకు ప్రజాసహకారం ఎంతైనా అవసరమని రానున్న కాలంలో వార్డులో నూతన రోడ్లు,కాలువలు నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి దిశగా పనులు పూర్తి అవుతాయని అన్నారు.. వార్డు కార్పొరేటర్ ఇమ్రాన్ మాట్లాడుతూ సుమారు 5 లక్షల వ్యయంతో చేపడుతోన్న డ్రీనేజి కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా రానున్న రోజుల్లో వార్డులో అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.


ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీధర్,రాష్ట్ర మైనార్టీ సెక్రటరీ SMD గౌస్, పేరం రామకృష్ణరెడ్డి, షఫీ, షేక్ఆశ, వరలక్ష్మి, ఖాజా, సుబ్బారెడ్డి, దేముడుబాబు, మోతి, మనోజ్, ఫాతిమా, లక్ష్మీ, ఉమాదేవి, షకీలా, స్వాతి, షాహిద్, సానిటరీ ఇన్సెప్క్టర్, సానిటరీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటర్ పిలు, వార్డు నాయకులు, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు...

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page