top of page

బాబుకు రాచమల్లు బహిరంగ లేఖ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 29, 2024
  • 1 min read

బాబుకు రాచమల్లు బహిరంగ లేఖ

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


టిడిపి ప్రభుత్వ హయాంలో 2014 నుండి 2019 వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో ఏ అభివృద్ధి చేశారో టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు తెలపాలని ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కరపత్రం విడుదల చేశారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరుకు చేరుకోనున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాఘలం యాత్రలో భాగంగా రాచమల్లు విడుదల చేసిన ఈ కరపత్రం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2014 నుండి 19 వరకు రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వ హయాంలో ఉండగా, ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి గా ప్రస్తుత టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఉన్నారని గుర్తుచేస్తూ, నాడు నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని ఆరోపణలు గుప్పిస్తూ, డ్వాక్రా మహిళలకు, రైతులకు, నిరుద్యోగ యువతకు, చేనేత కార్మికులకు ఎలాంటి లబ్ధి చేకూర్చారో ఇక్కడి ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అలా కాని ఎడల ఓటు అభ్యర్థించే అర్హత చంద్రబాబు నాయుడుకు లేదని ఆయన అన్నారు.





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page