top of page

దూదేకుల కళ్యాణ మండపానికి 50 సెంట్లు వితరణ కు ఎమ్మెల్యే హామీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 3, 2024
  • 1 min read

దూదేకుల కళ్యాణ మండపానికి 50 సెంట్లు వితరణ కు ఎమ్మెల్యే హామీ


మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే ను కలసిన నూర్ భాషా దూదేకుల సంఘం నాయకులు

ఎమ్మెల్యే రాచమల్లు ను సన్మానిస్తున్న దూదేకుల సంఘం నాయకులు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు పట్టణంలోని నూర్ భాషా దూదేకుల సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నూర్ భాషా దూదేకుల కులస్తులు సుమారు 15 వేల మంది ఉన్నారని, దాదాపుగా అన్ని పేద కుటుంబాలని పెళ్లిళ్లు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి వచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నూర్ భాషా దూదేకుల సంఘం కళ్యాణ మండపానికి 50 సెంట్లు స్థలాన్ని వితరణగా ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లు సంఘం నాయకులు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లి శివ ప్రసాద్ రెడ్డికి సంఘం పెద్దలు నాయకులు ధన్యవాదాలు తెలుపుతూ ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నూర్ భాషా దూదేకుల సంఘం నాయకులు కుల సభ్యులు సుమారు 500 మంది దాకా పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page