top of page

రేపటినుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న ఎమ్మెల్యే రాచమల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 14, 2024
  • 1 min read

రేపటినుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న ఎమ్మెల్యే రాచమల్లు

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


రానున్న ఎన్నికలలో తనను లక్ష ఓట్ల పైచిలుకు మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని భావిస్తున్నట్లు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాను ప్రజలకు ఒకే ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నానని, తాను, తమ ప్రభుత్వం ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసి ఉంటేనే ఓటు తమ పార్టీకి వేసి తనను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించమని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ, రేపటినుండి అనగా గురువారం ఉదయం రామేశ్వరంలోని శ్రీముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం, 9 గంటలకు ఎన్నికల ప్రచారాన్ని అక్కడి నుండే ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్నికల ప్రచారానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ బాబు, మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి తదితరులు పాల్గొంటున్నారని, కావున కార్యక్రమానికి నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, జగన్, రాచమల్లు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page