top of page

గెలిచింది వైసీపీ! సంబరాలు టిడిపి, బిజెపి నాయకులవా? - ఎమ్మెల్యే రాచమల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 23, 2023
  • 1 min read

గెలుపు వైసీపీ ది! సంబరాలు టిడిపి, బిజెపి నాయకులవా? - ఎమ్మెల్యే రాచమల్లు


గెలిచింది ఓడింది వైసిపి అభ్యర్థులే - ఎమ్మెల్యే రాచమల్లు

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు

కడప జిల్లా, ప్రొద్దుటూరు


ఈనెల 19వ తేదీన ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీ 13వ వార్డు మెంబర్ ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన ఇరువురు వైసీపీ అభ్యర్థులేనని, ఒకరు రెబెల్ కాగా మరొకరిని తాను ప్రతిపాదించి బరిలో నిలిపినట్టు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. గెలుపోటములు రాజకీయాలలో సహజమని, గెలిచిన అభ్యర్థి కూడా వైసిపి పార్టీకి చెందిన వారేనని, ఇందులో తాను బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడం ప్రజా నిర్ణయం అని, ఆ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఇకపోతే రాజుపాలెం మండలం తొమ్మిదవ వార్డులో వైసీపీకి సరైన అభ్యర్థి లేకపోవడం వలన అక్కడ టిడిపి గెలిచినట్లు, మూలవారిపల్లెలో తమ అభ్యర్థి బలంగా ఉన్నందున గెలిచామని ఆయన అన్నారు. అయితే ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ 13వ వార్డు ఉప ఎన్నికలలో తలపడిన ఇరువురు వైసీపీ అభ్యర్థులే అయినప్పుడు, ప్రొద్దుటూరు టిడిపి నాయకులు, బిజెపి నాయకులు తాము గెలిచినట్లు, ఇక్కడి గెలుపోటములు శాసించినట్లు పండగలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page