top of page

అగ్నిప్రమాద బాధితురాలికి ఆర్ధిక సాయం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 15, 2023
  • 1 min read

చెప్పడు కానీ చేసి చూపిస్తాడు


అగ్నిప్రమాద బాధితురాలికి ఆర్ధిక సాయం


త్వరలో ఇంటి స్థలం, నూతన గృహ నిర్మాణానికి హామీ

బాధిత కుటుంబానికి 20వేల ఆర్ధిక సాయం - రాచమల్లు


శనివారం సాయంత్రం వివేకానంద కాలనీ రామాలయం వద్ద నివాసం ఉంటున్న సరస్వతి ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోయి నిరాశ్రయులు కాగా విషయం తెలుసుకున్న ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన వొంతు సహాయంగా ఇరవై వేల రూపాయల ఆర్ధిక సహాయం చేసి మరోమారు తన మానవత్వాన్ని, సమాజం పట్ల గౌరవాన్ని చాటుకున్నారు. అలాగే ప్రభుత్వం ద్వారా ఇంటి స్థలం ఇప్పించి నిర్మించి ఇస్తామని బాధిత కుటుంబానికి భరోసా కల్పించిన ప్రొద్దుటూరు ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్. కార్యక్రమంలో కొత్తపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ గురుస్వామి, కామనూరు శ్రీనివాసులు, కామనూరు శేఖర్, డీలర్ జంగమయ్య, వార్డ్ మెంబర్ స్వాతి తదితరులు పాల్గొన్నారు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page