top of page

మధుమేహంతో బాధపడుతున్న విద్యార్థికి ఎమ్మెల్యే ఆర్ధిక సాయం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 9, 2022
  • 1 min read

మధుమేహంతో బాధపడుతున్న విద్యార్థికి ఎమ్మెల్యే ఆర్ధిక సాయం

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గతంలో పదునాలుగవ వార్డు సందర్శించగా, జీవన జ్యోతి హైస్కూల్ నందు ఏడవ తరగతి చదువుతున్న అబ్దుల్ తౌషీఫ్ తన మూడు సంవత్సరాల వయసు నుండి మధుమేహంతో బాధపడుతున్నాడని, పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న తల్లిదండ్రులు నెలకు పది వేల రూపాయలు ఖర్చు చేసి వైద్యం అందిస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు దృష్టికి వార్డు కౌన్సిలర్ జిలాన్ బాషా తీసుకుని రాగా, స్పందించిన ఆయన ప్రతి సంవత్సరం లక్ష రూపాయల నగదును అబ్దుల్ వైద్య ఖర్చుల నిమిత్తం అందేలా చర్యలు తీసుకొని, శుక్రవారం ఉదయం స్థానిక మునిసిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు చేతుల మీదుగా ఒక లక్ష రూపాయలు ఆర్ధిక సాయం చేయటం జరిగింది. ఈ సందర్భంగా అబ్దుల్ తల్లిదండ్రులు, వార్డు కౌన్సిలర్ జిలాన్ బాషా ఎమ్మెల్యే రాచమల్లుకు కృతజ్ఞతలు తెలియచేసారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page