top of page

ఎమ్మెల్యే మానవత్వానికి మురిసిన వృద్దులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 9, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు

గత నాలుగు రోజులుగా సోములవారిపల్లె పంచాయతి ఒకటవ సచివాలయ పరిధిలో చురుగ్గా పాల్గొంటున్న నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని, నిన్న ఈశ్వర్ రెడ్డి నగర్ కు చెందిన వృద్ధ దంపతులు చౌడమ్మ వెంకట స్వామి, అలాగే ఎం. లక్ష్మి దేవి అనే వృద్ద్ధురాలు తమ ఆవేదన బాధను ఎమ్మెల్యే రాచమల్లుకు వివరించారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు సానుకూలంగా స్పందించటమే కాకుండా తన మానవత్వాన్ని నిరూపించుకున్నారు. చౌడమ్మ, వెంకట స్వామి దంపతులకు ఆరు నెలలకు సరిపడా నిత్యావసరాలు, లక్ష్మిదేవికి పది వేల రూపాయల ఆర్ధిక సాయం అందచేశారు.

కార్యక్రమంలో సోములవారిపల్లె సర్పంచ్ మోపూరి ప్రశాంతి, ఉప సర్పంచ్ కృష్ణా రెడ్డి, ఎంపీటీసీ గోటూరి వెంకటేష్, వార్డు మెంబర్లు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page