top of page

మునిసిపల్ వాణిజ్య సముదాయానికి భూమి పూజ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 21, 2022
  • 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరు మునిసిపల్ పరిధి లోని విజయకుమార్ హాల్ ఎదురుగా ఉన్న మునిసిపల్ స్థలము నందు నేడు స్థానిక వైసీపీ MLA రచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు, G+1 సముదాయము గల భవన నిర్మాణానికి మునిసిపల్ నిధులు దాదాపు రెండు కోట్ల రూపాయల వ్యయంతో వాణిజ్య సముదాయాలు కట్టనున్నట్లు తెలిపారు, ఇందుకు గాను ఇప్పటికి 80 లక్షల రూపాయల నిధులు మంజూరు అయినట్లు ఈ సందర్భంగా స్థానిక MLA రచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు, కాగా ప్రొద్దుటూరు పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా మునిసిపల్ వాణిజ్య సముదాయాలు నిర్మించనున్నామని, మునిసిపాలిటీకి ఆదాయ వనరులు సమకూర్చి మునిసిపాలిటీ ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు, పై కార్యక్రమానికి రాష్ట్ర స్థాయికి చెందిన వివిధ శాఖల చైర్మన్లు, డైరెక్టర్లు, మునిసిపల్ శాఖ అధికారులు, స్థానిక వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు, కాంట్రాక్టర్ రమణా రెడ్డి పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page