top of page

నేతివారిపల్లి గడపగడపలో కొరముట్ల.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Oct 22, 2022
  • 1 min read

ప్రజలందరి సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం.

గడపగడపలో ఎమ్మెల్యే కొరముట్ల.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అర్హులకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్న వైసీపీ ప్రభుత్వ వివిధ సంక్షేమ పథకాల పై లబ్ధిదారుల అభిప్రాయాన్ని ప్రజా ప్రతినిధులే స్వయంగా తెలుసుకునేందుకు రూపొందించిన

"గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం అన్నమయ్య జిల్లా,చిట్వేలు మండలం నేతివారి పల్లి గ్రామ సచివాలయ పరిధిలోని నేతివారిపల్లె గ్రామంలో సర్పంచ్ గుండాల యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, శాసన సభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఆ గ్రామం లో పర్యటించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ప్రజల నుంచి వస్తున్న వినతులను, సమస్యలను అప్పటికప్పుడు సంబంధిత అధికారుల ద్వారా చర్చించి పరిష్కారం చూపేందుకై చర్యలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, ఎంపీపీ చంద్ర, వైసిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ, ప్రదీప్ రెడ్డి,లింగం లక్ష్మీకర్, ఉప సర్పంచ్ విజయభాస్కర్ రెడ్డి, పిచ్చిరెడ్డి, తాసిల్దార్ మురళీకృష్ణ, ఎంపీడీవో మోహన్ రావు, ఎస్ఐ సుభాష్ చంద్రబోస్,సర్పంచులు, ఎంపిటిసిలు,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page