top of page

వైఎస్సార్ యంత్ర సేవ పథకం రైతులకు వరం - ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 7, 2022
  • 1 min read

వైఎస్సార్ యంత్ర సేవ పథకం రైతులకు వరం

మంత్రాలయం, కోసిగి :

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ యంత్ర సేవ పథకం రైతులకు వరంగా మారిందని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో 52బసాపురం, సాతనూరు గ్రామాలకు యంత్ర సేవ పథకం కింద మంజూరైన ట్రాక్టర్లను లబ్దిదారులకు ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్న గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్సహా పరిచారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం, కోసిగి మండల కన్వీనర్ లు జి. భీమిరెడ్డి, మురళీ ధర్ రెడ్డి, 52బసాపురం, సాతనూరు సర్పంచులు రాఘవరెడ్డి, చంద్ర పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page