top of page

ఘనంగా సీనియర్ మైనార్టీ నాయకులు వైయస్ మహమూద్ జయంతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 14, 2024
  • 1 min read

దివంగత నేత ప్రొద్దుటూరు సీనియర్ మైనార్టీ నాయకులు వైయస్ మహమూద్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం

అన్నదానం చేస్తున్న కౌన్సిలర్ గౌస్

కడప జిల్లా, పొద్దుటూరు


కడప జిల్లా ప్రొద్దుటూరు సీనియర్ మైనార్టీ నాయకులు వైయస్ మహమూద్ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన కుమారులు 22వ వార్డు కౌన్సిలర్ వైయస్ మహమూద్ గౌస్, డాక్టర్ వైయస్ ముస్తఫా, వైయస్ మువాజ్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక అమ్మానాన్న వృద్ధ శరణాలయం, మదర్ తెరిసా వృద్ధాశ్రరణాలయం మరియు స్థానిక ప్రభుత్వ వైద్యశాల వద్ద స్టార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో వైయస్ మహమ్మద్ గౌస్,వైఎస్ ముస్తఫా, వైయస్ మొవాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు, వైఎస్ ఎమ్ యూత్ సభ్యులు దివంగత నేత కీర్తిశేషులు వైయస్ మహమూద్ ను స్మరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మున్న, షేక్ మున్న, వై ఎస్ ఎం యూత్ సభ్యులు ఇలియాస్ ,ఆరిఫ్, ఇబ్రహీం, నరేంద్ర, రోటరీ రియాజ్, సమీర్, అక్రమ్, ఆసిఫ్, ఖలీం తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page