top of page

ఆ మంత్రి గారి స్టైలే వేరు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 2, 2022
  • 1 min read

ప్రజ సమస్యలు చెబుతూ ఉంటే పట్టించుకోకుండా వెళ్లే ప్రజాప్రతినిధులు చూసి ఉంటారు... కానీ ఈ మంత్రి గారి స్టైలే వేరు.. ఆ గ్రామంలోకి వెళ్లి అక్కడ ఉన్న మహిళలతో మీ సమస్యలు చెప్పండమ్మా తీరుస్తాను అని అడగడం అరుదైన అద్భుత విశేషం... నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు లో ఒక కార్యక్రమానికి వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో పట్టణ రెండవ వార్డు వెంకట్రావు పల్లి కి చెందిన ప్రజా ప్రతినిధుల పిలుపు మేరకు ఆ గ్రామంలో కి వెళ్ళిన మంత్రి అక్కడ ఉన్న మహిళ వద్దకు వెళ్లి మీ గ్రామ సమస్యలు చెప్పండమ్మా తీరుస్తాను అని అడిగి మరి వారు చెప్పిన సమస్యలను ఈ ఏడాది పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.. మంత్రిగారే ఎదురొచ్చి సమస్యలు చెప్పండమ్మా తీరుస్తాను అంటూ అడగడం ఆ మహిళ లే విస్తుపోవడం విశేషం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page