top of page

మెగా జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలి

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 6, 2023
  • 1 min read

మెగా జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలి

అధికారులకు సూచనలు చేస్తున్న ఎమ్మెల్యే మేడా

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


ఈనెల 15వ తేదీన శ్రీ అన్నమాచార్య కళాశాలలో నిర్వహించే మెగా జాబ్ మేళా ను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి, సబ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాజంపేట రైల్వే కోడూరు లోని తహసీల్దార్లు, మండలాభివృద్ధి అధికారులు, ఇతర శాఖల అధికారులతో కలిసి మెగా జాబ్ మేళా పై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజంపేట రాజ్యసభ సభ్యులు మిథున్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సహకారంతో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. నిరుద్యోగుల కోసం 80 కి పైగా కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నట్లు తెలిపారు. రూ 15 వేలు నుంచి రూ 50 వేలు వరకు వేతనంతో కూడిన ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పించడం జరుగుతుందని అన్నారు. https://forms.gle/RKBVU1peZEMkfEbTA లో లాగిన్ అయి అంతర్జాలంలో నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page