top of page

క్షయ వ్యాధిపై మెగా హెల్త్ మేళా

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 15, 2023
  • 1 min read

క్షయ వ్యాధిపై మెగా హెల్త్ మేళా

క్షయ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్న డాక్టర్ సృజన

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


టీబీ యూనిట్ మెడికల్ అధికారి డాక్టర్ సృజన ఆధ్వర్యంలో బుధవారం బోయినపల్లి, ఎంజిపురం లలో మెగా హెల్త్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సృజన మాట్లాడుతూ క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. క్షయ వ్యాధి లక్షణాలను, వాటికి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. బరువు తగ్గడం, రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే గల్ల పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్ జయప్రకాష్, సిహెచ్ఓ వెంకట్ నారాయణ, రాజమ్మ, సూపర్వైజర్ రవి, అసిస్టెంట్ మధు, శివ, ఎం ఎల్ హెచ్ పి లు, ఏఎన్ఎం, ఆశాలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page