రూ15 లక్షలతో సిసి రోడ్లకు భూమి పూజ - ఎమ్మెల్యే రాచమల్లు
- VOICE OF HERALD

- Aug 24, 2023
- 1 min read
రూ15 లక్షలతో సిసి రోడ్లకు భూమి పూజ
- ఎమ్మెల్యే రాచమల్లు

ప్రొద్దుటూరు మండలం, కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని మీనాపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ పర్యటనలో భాగంగా ఆ గ్రామ ప్రజలు రోడ్డు సమస్య ఉందని తెలుపగా, అందుకు స్పందించిన ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆనాడే గ్రామ ప్రజలకు నాలుగు నెలల్లో గ్రామానికి రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు. గురువారం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని మీనాపురం గ్రామంలో 15 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం నిధుల కింద సిమెంట్ రోడ్డు కు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం నుండి ఈ గ్రామానికి ఏ ఒక్క అభివృద్ధి జరగలేదని ఈ గ్రామానికి ప్రధానమైన రహదారి ఒకటే ఉన్నందున గడపగడప కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు గ్రామ ప్రజలు తమకు రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేయగా ఆనాడే వారికి మాట ఇచ్చి కచ్చితంగా నాలుగు నెలల్లో రోడ్డు వేస్తామని వారికి హామీ ఇచ్చామన్నారు. గురువారం వారికి ఇచ్చిన మాట ప్రకారం 15 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశామన్నారు. అలాగే వివేకానంద నగర్, ప్రకాష్ నగర్, మచ్చ కాలనీ, టీచర్స్ కాలనీ, అమృత నగర్, ఆటోనగర్, నూతన కాలువలు రోడ్లు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ గురుస్వామి, ఎంపీటీసీ పేరం సునీత బ్రహ్మానంద రెడ్డి, వార్డు మెంబర్ లక్ష్మీనారాయణ రెడ్డి, మీనాపురం గ్రామ వైసీపీ నాయకులు శేఖర్, కార్యకర్తలు పాల్గొన్నారు.






Comments