top of page

గడప గడపకు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కరణ - రాచమల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 22, 2023
  • 1 min read

గడప గడపకు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కరణ - రాచమల్లు

వైఎస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గత కొన్ని నెలలుగా తాను ప్రజలతో మమేకమై వారి సమస్యల సత్వర పరిష్కారం కొరకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని మీనాపురం, గండ్లూరు కొట్టాల గ్రామాలలో సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్రా రెడ్డి, రెండవ వార్డు మెంబెర్ ఇందిరమ్మ అధ్యక్షతన జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయన దృష్టికి పలు సమస్యలను తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ శ్రీ శ్రీ భీమ శంకర ఆలయం నందు ప్రత్యేక పూజలు గావించి తీర్ధప్రసాదాలు అందుకున్నారు. కార్యక్రమంలో అప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీ రాజారాం రెడ్డి, ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్, రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహా రెడ్డి, నాటక మండలి డైరెక్టర్ బండారు సూర్య నారాయణ, వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగశేషా రెడ్డి, యువ నాయకుడు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, మీనాపురం వైసీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, అజయ్ యాదవ్, అశోక్ యాదవ్, బాషా, సుబ్బయ్య, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page