top of page

అనాధ మృతదేహానికి అంత్యక్రియలు

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 13, 2022
  • 1 min read

కడప జిల్లా,, స్థానిక యర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామంలో ఎద్దుల పెద్ద శేషమ్మ అనాధ ఆశ్రమము నందు ఇద్దరు మహిళలు ఒకేసారి చనిపోవడంతో శేషమ్మ(45) మారేలా అంజనమ్మ (65) అనే ఇద్దరు వృద్ధులు జీవనం కొనసాగించే వారు. గత కొన్ని రోజులుగా ఇద్దరికి ఆరోగ్యం బాగలేకపోవడం తో 12.02.21 వ తేదీన సాయంత్రం ఇద్దరు మరణించగా వారికి బంధువులు ఎవరు లేకపోడంతో ఆశ్రమం నిర్వాహకుడు నాగేంద్ర మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ చైర్మన్ మోరే.లక్ష్మణ్ రావు ని సంప్రదించగా వారు వెంటనే స్పందించి యర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామంలో హిందూ సంప్రదాయం ప్రకారం అంతక్రియలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ లక్ష్మణ్ రావు, మల్లికార్జున్, ప్రొద్దుటూరు ప్రెసిడెంట్ కామనూరు శివసాయినాథ్, ప్రొద్దుటూరు ట్రెజర్ శ్రీకాంత్, చంద్ర శేఖర్, అనాధ శరణాలయం నిర్వాహకుడు నాగేంద్ర పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page