top of page

తొమ్మిది పదుల వయసులో తగ్గని అభిమానం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 19, 2022
  • 1 min read

తొమ్మిది పదుల వయసులో తగ్గని అభిమానం

మంత్రాలయం మండల పరిధిలోని సుంకేశ్వరి గ్రామానికి చెందిన బెల్లంఅందెమ్మ తొభై పదుల వయసులో కూడా రాంపురం రెడ్డి సోదరుల మీద అభిమానం చాటుకుంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ నేత వై. ప్రదీప్ రెడ్డి హాజరయ్యారు విషయం తెలియడంతో ఇంట్లో ఉన్న వృద్ధురాలు వారిని చూసేందుకు స్టాండ్ సహాయంతో రోడ్డు వస్తుందన్నా విషయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లడంతో వద్దు మనమే పెద్దాయమ్మ దగ్గరికి వెళ్దామని ఎంపీ సంజీవ్ కుమార్, వైఎస్సార్సీపీ నేత వై. ప్రదీప్ రెడ్డి తో కలిసి వెళ్లారు. వృద్దురాలు ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, వైఎస్సార్సీపీ నేత వై. ప్రదీప్ రెడ్డి చూసిన వెంటనే బాగుండావా నాయనా, నాయప్పోళ్లు దేవుళ్ళు వచ్చిరని ఆనందం వ్యక్తం చేస్తు గంతేసింది. నీవు పెద్దాయమ్మ మాకు నీ ఆశీర్వాదం ఉండాలని ఎమ్మెల్యే ఆమె చేతులను తీసుకుని తలపై ఉంచుకున్నాడు. పక్కనే ఉన్న ఎంపీ సంజీవ్ కుమార్ ను పరిచయం చేయగా సంతోషం నాయనా అని వృద్ధురాలు ఎంపీతో మాట్లాడుతు జై గురు దేవా అంటు ఎంపీకి ఆశీర్వాదం చేసింది. ఈ సన్నివేశాని చూసిన పలువురు అవ్వ అభిమానానికి అవధులు లేవని చర్చించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page