top of page

రైతులకు న్యాయం జరిగేలా చూడండి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 9, 2022
  • 1 min read

మంత్రాలయం నియోజకవర్గంలోని ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణానికై భూ సేకరణ లో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మోహన్ దాస్ ను ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆదేశించారు. బుధవారం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో ఆర్డీఎస్ కుడి కాలువ భూ సేకరణ కు సంబంధించి రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతుల అభిప్రాయాలను సేకరించి వారు డిమాండ్ చేసిన నగదు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అవసరమైతే జిల్లా కలెక్టర్ తో కూడా మాట్లాడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ , ఇన్ చార్జ్ జి. భీమిరెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, బాబిరెడ్డి కోసిగి మండల నాయకులు ఐరన్ గల్లు శ్రీనివాస్ రెడ్డి, బెట్టన్నగౌడ్ కోసిగి తహసీల్దార్ రుద్రగౌడ్, నాగార్జున కంపెనీ కన్స్రక్టన్ ప్రతినిధులు ప్రణీత్, అనుదీప్ తదితరులు ఉన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page