top of page

కెవిపిఎస్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావ్ జయంతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 5, 2022
  • 1 min read

మంత్రాలయం, బాబు జగ్జీవన్ రావ్ 114 వ జయంతి సందర్భంగా మంత్రాలయంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది

మంత్రాలయం మండల కేంద్రంలో స్కూల్ ఆవరణలో ఎమ్మార్వో ఆఫీస్ ముందు రామచంద్ర నగర్ డ్రైనేజీ లో బ్లిచింగ్ పౌడర్ చల్లి నిరసన తెలియజేయడం జరిగింది బాబు జగ్జీవన్ రావ్ ఉన్నతమైన చదువులు చదివి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఒక గుర్తింపు గా కలిగిన వ్యక్తి బాబు జగ్జీవన్ రావ్ అని వారు కొనియాడారు. ఆయన ఆశయాలు సాధన కోసం ప్రతి ఒక దళితుడు కష్టపడి దళితుల కోసం దళిత ప్రజానీకం కోసం పని చేయాలని వారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు హెచ్ జయరాజు. మంత్రాలయం కెవిపిఎస్ మండల కార్యదర్శి బొగ్గుల అనిల్. కెవిపిఎస్ మండల నాయకులు అంజి. కెవిపిఎస్ నాయకులు దేవపుత్ర .ప్రకాశం నారాయణ .రాఘవేంద్ర .యం శివ.యం అయ్యప్ప. తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page