top of page

మన్నూరు పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి

Writer: EDITOR
EDITOR
Feb 1, 2023
1 min read

మన్నూరు పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి

ఉపాధ్యాయుల ద్వారా వివరాలు సేకరిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి రాఘవరెడ్డి

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


బుధవారం మన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎద్దుల రాఘవరెడ్డి సందర్శించారు. రెండవ దశ నాడు నేడు పనులను ఈ సందర్భంగా ఆయన పర్యవేక్షించారు. పరిసరాల పరిశుభ్రతను, వంటశాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి అకడమిక్ ఆడిట్ లో భాగంగా ప్రధానోపాధ్యాయురాలు పరిమళ ద్వారా విద్యార్థుల హాజరు వంటి విషయాలను చర్చించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వెంకటేష్ నాయక్, సర్వ శిక్ష అభియాన్ కోఆర్డినేటర్ శ్రీహరి, ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page