top of page

జగనన్న కాలనీ స్థలాన్ని పరిశీలించిన మండల స్పెషల్ ఆఫీసర్ కేడి వరప్రసాద్

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 8, 2022
  • 1 min read

జగనన్న కాలనీ స్థలాన్ని పరిశీలించిన మండల స్పెషల్ ఆఫీసర్ కేడి వరప్రసాద్ - ఇళ్ల స్టలాల మధ్యలో 11 కెవి విద్యుత్తు లైను తొలగించాలని ఫిర్యాదు చేసిన లబ్ధిదారులు.

మండల పరిధిలోని రాజుకుంట పంచాయతీ అనుంపల్లి గ్రామం నందు అర్హులకు మంజూరు చేయబడిన జగనన్న కాలనీ స్థలాన్ని మండల స్పెషల్ ఆఫీసర్ కేడివరప్రసాద్ ఈరోజు ఉదయం సందర్శించారు. తానూ మాట్లాడుతూ లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించాలని, దానికి కావాల్సిన మెటీరియల్ ను ప్రభుత్వం విడతలవారీగా ఇస్తుందని సూచించారు.

కాగా లబ్ధిదారు చిన్నమ్మి ఫ్లాట్ నెంబర్ 38 నందు 11 కె.వి విద్యుత్ వైర్లు అడ్డుగా ఉన్నాయని, ఫిర్యాదు చేయగా వెను వెంటనే విద్యుత్ అధికారులకు ఈ విషయాన్ని తెలుపుతూ స్పందించాలని కోరారు. పనులను ప్రారంభించడానికి నీటి వసతిని కూడా కల్పించాలని లబ్ధిదారులు సంబంధిత అధికారిని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధిహామీ అధికారి ఓబులేసు, స్థానిక లబ్ధిదారులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page