top of page

మానవత ఆధ్వర్యంలో పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Feb 28, 2022
  • 1 min read

చిట్వేలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు పగడాల రామసుబ్బయ్య మరియు సుధామణి కుమారుడైన పగడాల గణేష్ కుమార్ జన్మదిన సందర్భంగా.. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గణేష్ తల్లి సుధామణి పేదలకు ఆహార పొట్లాలు అందించారు. కాగా గణేష్ తమ్ముడు భరత్ కుమార్ కందుకూరు లోని "స్వర్ణ స్వయంకృషి పాఠశాలకు" భోజనాన్ని వితరణ చేశారు. వారు ఇరువురు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జన్మదిన సమయంలో ఆడంబరాలు గాక ఆపదలో ఉన్న వారికి పట్టెడన్నం దానం చేసి వారి కళ్లల్లో ఆనందం నింపాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులు మునిరావు తదితరులు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page