top of page

అగనంపూడి లో ఘనంగా జరిగిన మహాత్మ జ్యోతిరావు పూలే 195 వ జయంతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 11, 2022
  • 1 min read

అగనంపూడి లో ఘనంగా జరిగిన మహాత్మ జ్యోతిరావు పూలే 195 వ జయంతి.

అగనంపూడి సిడబ్ల్యూసీ వద్ద జ్యోతి రావు పూలే చిత్రపటానికి రాష్ట్ర ఓబిసి కార్యదర్శి కొలిపాక అప్పారావు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే జీవితం ఒక చరిత్రాత్మక పరిమాణానికి ప్రతీక బానిస భావజాలాన్ని సామాజిక విప్లవకారుడు సమాజ కార్యకర్త ఉద్యమకారుడు సంఘ సేవకుడైన ఆయన ఆశయాలను భావితరాల యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

ఎ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురువుగా పూజించే జ్యోతిరావు పూలే త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెనుకబడిన తరగతుల సామాజిక న్యాయం చేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు.

విశాఖ జిల్లా రజక సంక్షేమ సంఘం అధ్యక్షులు తోకాడ రాము సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అగనంపూడి ఉద్యానవనం సొసైటీ అధ్యక్షులు నెల్లి శ్రీనివాసరావు, వైయస్సార్ సిపి నాయకులు బలిరెడ్డి శీను, 85 వార్డ్ తెలుగు యువత అధ్యక్షులు బండారు చందు రమేష్, జనసేన పార్టీ నాయకులు బుదిరెడ్డి అప్పారావు ,అగనంపూడి విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు కొమ్మజి భీష్మచారి, పద్మ మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం నాయకులు గందోలి పైడికొండ, బేతా హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వీట్లు పంచి పెట్టడం జరిగింది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page