top of page

11న జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద మహాధర్నా - సీపీఐ(ఎం), సీఐటీయూ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 8, 2022
  • 1 min read

గాజువాక ప్రసన్న ఆంధ్ర విలేకరి


ప్రజలపై చెత్తపన్ను ఆస్తిపన్ను భారాలను నిరసిస్తూ ఈ నెల 11న జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు సీపీఎం కార్పొరేటర్ బి గంగారావు, సీఐటీయూ నేత జి సుబ్బారావు తెలిపారు.

ఈ మేరకు షీలానగర్,వెంకటేశ్వర కోలనీ తదితర ప్రాంతాల్లో ర్యాలీ చేపట్టి ఇంటింటికి కరపత్రాలు పంచిపెట్టారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తరుణంలో ప్రజలపై భారాలు మోపడం తగదన్నారు.చెత్తపన్ను విధానం అనేది గతంలో ఎప్పుడూ లేదని వైసీపీ అధికారంలోకి వచ్చాక రకరకాల పనులతో ప్రజల నడ్డి విరుస్తోందని విమర్శించారు.ప్రజలంతా చైతన్యవంతమై జీవీఎంసీ అనుసరిస్తున్న విధానాలపై పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఐద్వా ప్రతినిధులు మణి, సత్యవతి, కాలనీ కమిటీ సభ్యులు కృష్ణమోహన్, శ్రీనివాస్ రావు వీరాజు, తదితరులు పాల్గొన్నారు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page