top of page

కల్వర్టును ఢీకొన్న కారు ప్రమాదంలో ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jun 16, 2022
  • 1 min read

కల్వర్టును ఢీకొన్న కారు.


--ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.

--బాధితులు అందరూ ఒకే కుటుంబ వాసులు.

--శోక సంద్రంలో ఎం రాచపల్లి గ్రామం.




నంద్యాల జిల్లా,పాణ్యం మండలం, తమ్మరాజు పల్లి వద్ద కారు కల్వర్టును ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.


వివరాల్లోకి వెళితే .. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండల పరిధిలోని మైలపల్లి పంచాయతీ ఎం రాచపల్లి కి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆసుపత్రి చికిత్స నిమిత్తం రాత్రి స్వగ్రామము నుంచి బయలుదేరి హైదరాబాదుకు వెళుతుండగా కల్వర్టును బలంగా ఢీకొనడంతో పాండురాజు సుబ్బరామ రాజు(65), రెండవ కుమారుడు కుమార్ రాజు (35), అక్కడికక్కడే మృతి చెందగా..మూడవ కుమారుడు హరికృష్ణమ రాజు (30) సోదరుడి కుమారుడు వాసు కృష్ణంరాజు (36) తీవ్రంగా గాయపడి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తమ బంధువులు తెలిపారు.




కాగా మృతులు ఇరువురిని పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామానికి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఒకే కుటుంబం వాసులకు ఇంతటి ప్రమాదం జరగడంతో ఎం రాచపల్లి గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. నిద్రమత్తులో ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణమా అన్నది తెలియాల్సి ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page