top of page

అంబేద్కర్ ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఎల్ వి మోహన్ రెడ్డి

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 14, 2022
  • 1 min read

అంబేద్కర్ ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఎల్ వి మోహన్ రెడ్డి - చిట్వేలు జయంతి ఉత్సవాలలో ఎల్ వి మోహన్ రెడ్డి.

డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ ఆశయాలు యువతకు స్పూర్తి దాయకమని .. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా మండల వైసిపి సీనియర్ నాయకులు ఎల్ వి మోహన్ పేర్కొన్నారు.


ఈరోజు ఉదయం అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి చిట్వేలు గ్రామ ఉపసర్పంచ్ ఉమా మహేశ్వర్ రెడ్డి, మండల ఎంపిపి, ఉప ఎంపీపీలు చంద్ర, సుబ్రహ్మణ్యం రెడ్డి ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలతో కలిసి గజమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగ రూపకర్తగా దిశానిర్దేశం చేసిన తన ముందుచూపు మనందరికీ స్ఫూర్తిదాయకమని, అన్ని రంగాల్లోనూ ప్రత్యేకతను చాటుకుంటూ... ఎక్కడ జన్మించననూ, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ను అన్నింటినీ జయించి చరిత్రపుటల్లో స్థిరంగా నిలిచిన అపర మేధావి అంబేద్కర్ అని జయహో అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం బాధ్యులు పంది కాళ్ల మనీ, ఒబిలి పెంచలయ్య, రాష్ట్ర వికలాంగ సంక్షేమ అధ్యక్షులు జెఎన్ ఆంధ్రయ్య, హరిప్రసాద్, జాకీర్, సుబ్బనరసయ్య, ప్రసాద్, సుబ్బ నరసయ్య, మురళి, సర్పంచ్ ఈశ్వరయ్య, నాగేశ్వర, చెంచయ్య, వెంకటేష్, మందా రవి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page