top of page

హద్దులు మీరిన ప్రేమ జంట

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 19, 2022
  • 1 min read

పీక‌ల‌దాకా మ‌ద్యం తాగాక‌.. బైక్ పై రోడ్డెక్కారు ఓ యువ‌ జంట‌. ఒళ్లు తెలియ‌ని స్థితిలో రోడ్డుపై హ‌ద్దులు దాటి ముద్దులు పెట్టుకోసాగారు. జ‌నాల‌ను గుద్దుకుంటూ ఇష్టానుసారంగా బండి న‌డిపారు. ఇదేంట‌ని అడిగిన వారిని పిడిగుద్దుల‌తో దాడి చేశారు. అడ్డుకున్న పోలీసుల‌పై దాడి చేశారు. లాభం లేద‌ని వీరిని పోలీసుస్టేష‌న్‌కు త‌ర‌లిస్తే.. అక్క‌డా సోయి మ‌రిచి ముద్దులు, కౌగిలింత‌ల‌తో రెచ్చిపోయారు. ఈ అస‌హ్య‌క‌ర‌మైన ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని వేలూరులో జ‌రిగింది. వివ‌రాలు.. వేలూరు అన్నాసాలైలో సోమవారం మధ్యాహ్నం ఒక యువ జంట మద్యం మత్తులో బైకుపై రోడ్డెక్కారు. అంద‌రినీ ఢీకొట్టుకుంటూ అడ్డ‌దిడ్డంగా బండి న‌డిపారు. రోడ్డుపై ముద్దుల‌తో రెచ్చిపోయారు. త‌రువాత‌ సిగ్న‌ల్ వ‌ద్ద ఆగారు. ఇదేంట‌ని ఓ వాహ‌న‌దారుడు ప్ర‌శ్నించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ యువ‌తి స‌ద‌రు వాహ‌న‌దారుడిపై దాడి చేసింది. అక్క‌డే విధులు నిర్వ‌హిస్తున్న ఎస్‌.ఐ. రాజ్‌కుమార్ ఆ యువ‌తిని అడ్డుకున్నాడు. అంతే ఆ యువ‌తి ఎస్‌.ఐ.పైనా దాడి చేసింది. దీంతో వెంట‌నే నార్త్‌ పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి ఎస్‌ఐ నిర్మల వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోగా ఆ యువతి ఆమెపైనా దాడిచేసినట్లు పోలీసుల

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page