top of page

తిరుమల శ్రీవారికి కర్ణాటక వారు లారీ విరాళం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 23, 2022
  • 1 min read

తిరుమల శ్రీవారికి కర్ణాటక వారు లారీ విరాళం

తిరుమల శ్రీవారికి కూరగాయల రైతులు లారీని విరాళంగా అందజేశారు. కర్ణాటకలోని ముళబాగల్ మాజీ ఎమ్మెల్యే జి. మంజునాథ్‌తో పాటు మరో 12 మంది కూరగాయల దాతలు రూ. 30 లక్షల విలువైన లారీని తిరుమల,తిరుమపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఈ మేరకు లారీ తాళంచెవులను ఆయనకు అందజేశారు.టీటీడీ అన్నప్రసాద కార్యకలాపాలకు కూరగాయలను తీసుకెళ్లేందుకు ఈ వాహనాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. కార్యక్రమంలో టీటీడీ అన్నప్రసాదం, దాతల విభాగం డిప్యూటీ ఈఓ పద్మావతి, డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ జానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page