top of page

ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 18, 2022
  • 1 min read

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


మంగళవారం మధ్యాహ్నం టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. టిడిపి నియోజకవర్గ ఇంచార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రవీణ్ కుమార్ ఇంటి వద్దకు జిల్లా నలుమూలల నుండి నాయకులు, టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకున్నారు. ఏ సమస్య వచ్చినా ప్రవీణ్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని లోకేష్ మాట ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పని చేసేవారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రవీణ్ కుటుంబ సభ్యులతో నారా లోకేష్ అన్నారు. అలాగే దాడిలో గాయపడిన మేరువ మూర్తీని నారా లోకేష్ పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ప్రవీణ్ కుమార్ భార్య మౌనిక రెడ్డి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియచేశారు. టీడీపీ పెద్దలు నేతలు కార్యకర్తలు తమ కుటుంబానికి ధైర్యాన్ని, సహకారాన్ని అందించారన్నారు. కార్యకర్తలే తమకు అండ అని, మేము పడ్డ కష్ఠానికి ఈరోజు ఫలితం దక్కిందన్నారు. నైతికంగా విజయం సాదించినట్టుందని మౌనిక రెడ్డి తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page