top of page

చిరుతలు కాదు అడవి కుక్కలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 28, 2022
  • 1 min read

(ప్రసన్న ఆంధ్ర, అశోక్, కమలాపురం విలేకరి) వై.ఎస్.ఆర్ జిల్లా, వేంపల్లె


వేంపల్లె మండలం నాగూరు గ్రామంలో ఉదయం నుంచి రెండు చిరుత పులులు సంచరిస్తున్నాయని సామాజిక మాధ్యమాలలో విపరీతమైన ప్రచారం, స్పందించిన అటవీశాఖ అధికారులు గ్రామంలోని పంట పొలాలను గ్రామస్తులతో కలిసి పరిశీలించడం జరిగింది.

పొలాలలో అడుగుజాడలను గుర్తించి శ్రీశైలం అటవీ శాఖ నిపుణులకు వేంపల్లి ఫారెస్ట్ అధికారులు ఫోటోలను పంపించారు. ఫొటోలను క్షుణ్ణంగా పరిశీలించిన శ్రీశైలం అటవీ శాఖ నిపుణులు అవి అడవి కుక్కలు గా తేల్చి చెప్పారు. దీంతో గ్రామస్తులు, రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page