top of page

విద్యార్థులపై లాఠీచార్జి అమానుషం – NEET పేపర్ లీక్‌ పై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • 3 days ago
  • 1 min read

విద్యార్థులపై లాఠీచార్జి అమానుషం – NEET పేపర్ లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి


ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల బందుకు MPJ, JIH, IYM, SIO సంపూర్ణ మద్దతు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద NEET పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో జరిగిన అవకతవకలు మరియు విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని MPJ, JIH, IYM, SIO సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ సంఘటనను నిరసిస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విద్యాసంస్థల బందుకు పలు సంస్థలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు శివాలయం సెంటర్‌లో నిరసన కార్యక్రమం లో నాయకులు మాట్లాడుతూ, దేశంలో పోటీ పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మకం కోల్పోయే పరిస్థితులు ఏర్పడటం అత్యంత ఆందోళనకరమన్నారు. NEET పేపర్ లీక్ వంటి ఘటనలు లక్షలాది మంది విద్యార్థుల కష్టాన్ని, భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయని పేర్కొన్నారు.


NEET పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ వ్యవహారంపై పారదర్శకమైన, నిష్పాక్షిక దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దేశంలోని అన్ని పోటీ పరీక్షలను పూర్తి పారదర్శకతతో నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నాము విద్యార్థుల నిరసనల్లో ఈ డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది.


ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. విద్యార్థుల గొంతును లాఠీలతో అణచివేయడం కాకుండా, వారి ఆందోళనలను ప్రభుత్వం ఆలకించి న్యాయం చేయాలి. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, లాఠీచార్జి ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము.


దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, వారి హక్కులు, గౌరవం, భవిష్యత్తును కాపాడటం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, పట్టణ అధ్యక్షుడు హుషన్ బాష, కార్యదర్శి మమ్మద్ రఫీ, జమాత్ ఇస్లామి హింద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ఎస్ మోహిద్దిన్,పట్టణ అధ్యక్షులు షఫీవుల్లా, కార్యదర్శి రహమతుల్లా, ఐవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేపారి షఫీ, పట్టణ అధ్యక్షులు జబివుల్లా, ఎస్ఐఓ రాష్ట్ర కార్యదర్శి ఆదిల్ ఉమ్రి, పట్టణ అధ్యక్షుడు రోషన్ జమీర్, కార్యదర్శి ఇజాజ్ తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page