top of page

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక శ్రద్ధ నన్ను కదిలించింది : కైకాల

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 20, 2022
  • 1 min read

గత ఏడాది నవంబర్ లో అనారోగ్యం పాలై అపోలో హాస్పిటల్ లో చేరిన టాలీవుడ్‌ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది. పూర్తిగా కోలుకున్న ఆయన ఏపీ సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అలాగే తన అనారోగ్య సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. తాను ఆసుపత్రిలో ఉన్న సమయంలో తనకు అందించిన అమూల్యమైన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కాల్ చేసి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం ద్వారా మీరు చూపిన శ్రద్ధకు పట్ల నేను చాలా సంతోషిస్తున్నానని ఆయన అన్నారు. మీరు హామీ ఇచ్చినట్టుగానే మీ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు, వైద్య ఖర్చులను తీర్చడానికి ఆర్థిక సహాయంతో సహా అన్ని రకాల సహాయాన్ని అందించారు. ఆ కష్ట సమయాల్లో మీ సహాయం నాకు, నా కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చిందని ఆయన అన్నారు. మీరు చూపిన ఈ శ్రద్ధ మీకు కళాకారుల పట్ల మరియు వారి శ్రేయస్సు పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page