top of page

డా.కృష్ణాస్ లైఫ్ హాస్పిటల్ ను ప్రారంభించిన బత్యాల

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 10, 2023
  • 1 min read

డా.కృష్ణాస్ లైఫ్ హాస్పిటల్ ను ప్రారంభించిన బత్యాల

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


శుక్రవారం పట్టణంలోని డా.కృష్ణాస్ లైఫ్ హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవానికి ఆసుపత్రి యాజమాన్యం మాలేపాటి వెంకటరమనాయుడు, డాక్టర్ కృష్ణ, డాక్టర్ విన్య పిలుపుమేరకు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి బత్యాల చెంగల రాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ఆసుపత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణానికి విచ్చేసిన బత్యాలను ఆసుపత్రి యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. అనంతరం బత్యాల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రి యాజమాన్యం బత్యాల ను ఘనంగా సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బత్యాలకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు రాజంపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page