top of page

సొసైటీ స్థలం కబ్జాకు యత్నం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 1, 2022
  • 1 min read

కృష్ణా జిల్లా, గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామములో ఉద్రిక్తత. ది లేబర్ కాంట్రాక్ట్ కో-ఆపరేటివ్ క్వారీ సొసైటీ లిమిటెడ్ స్థలాన్ని కబ్జా చేశారని వీరపనేనిగూడెం గ్రామస్తులు ఆవేదన, సొసైటీ స్థలం లీజుకు ఇవ్వడంతో కబ్జాకు పాల్పడిన లీజ్ యజమాని. గురువారం రాత్రి స్థలము లోపల ఉన్న సామాన్లను రోడ్డు బయటకు పారవేసిన సొసైటీ కమిటీ సభ్యులు. రాళ్లతో సొసైటీ గోడలను పగల గొడుతున్న సొసైటీ కమిటీ సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పటాన్ని కూడా తీసి బయట పారేసిన సొసైటీ కమిటీ సభ్యులు. గుంటక సుబ్బారెడ్డి అనే వైస్సార్సీపీ సానుభూతిపరుడు వ్యక్తి లీజుకు ఇస్తే అదే వ్యక్తి కబ్జాకు దిగినాడు అని సొసైటీ కమిటీ ఆరోపణ. ఏడు కూలలకు చెందిన సొసైటీ కమిటీ స్థలం, ఉంగుటూరు మండలం తేలప్రోలు నుంచి వచ్చి సొసైటీ కమిటీ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్న సుబ్బారెడ్డి. లేబర్ కమిటీ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్న సుబ్బారెడ్డి, సొసైటీ స్థలం దగ్గర వస్తే కత్తి చూపిస్తున్నాడని కమిటీ సభ్యులు ఆవేదన. 2 సంవత్సరాలు లీజుకు తీసుకొని 12 సంవత్సరాలకు లీజుకి ఇచ్చారని డాక్యుమెంట్స్ తారుమారు చేసిన సుబ్బారెడ్డి.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page