top of page

క్రీడలతోనే శారీరక మానసిక ఉల్లాసం. ఎస్సై వెంకటేశ్వర్లు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 20, 2022
  • 1 min read

క్రీడలతోనే శారీరక మానసిక ఉల్లాసం


క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభంలో ఎస్సై వెంకటేశ్వర్లు.



అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం మైలపల్లి పంచాయతీ ఎం రాచపల్లి గ్రామంలోని యన్నాపుడి ఆలయ ప్రాంగణం నందు ఈ రోజున సదరు గ్రామ యువత నిర్వహించిన మండలస్థాయి క్రికెట్ టోర్నమెంటును స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ప్రారంభించి; కాసేపు తాను క్రికెట్ బ్యాట్ పట్టి పాత రోజులను గుర్తు చేసుకుంటూ.. చదువుతోపాటు ఆటలు ప్రతి వ్యక్తి శారీరక,మానసిక ఆనందానికి దోహదం చేస్తాయని ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం సంతోషకరమని, శాంతి సామరస్యాల మధ్య ఆటను కొనసాగించాలని అన్నారు.



టోర్నమెంట్ నిర్వాహకులైన రాచపల్లి గ్రామ యువత గిరిబాబు రాజు,వెంకటేష్ రాజు, ప్రకాష్, సురేష్, రాజేష్ తదితరులు మాట్లాడుతూ...ఈ రోజున ప్రారంభమైన ఈ టోర్నమెంట్ ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగుతుందని ఇందులో ఇప్పటివరకు పది జట్లు పాల్గొంటున్నాయని; మొదట, రెండవ స్థానాలలో నిలిచిన వారికి వరుసగా పదివేలు,ఐదు వేలు బహుమతులుగా నిర్ణయించామని, టోర్నమెంటు నిర్వహణకు సహకరించిన నాయకులకు, అధికారులకు, గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page