top of page

పంచాయతీల అభివృద్ధికి సచివాలయ వ్యవస్థ కీలకం - కొనిరెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 21, 2023
  • 1 min read

పంచాయతీల అభివృద్ధికి సచివాలయ వ్యవస్థ కీలకం - కొనిరెడ్డి

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని సచివాలయాలలో పనిచేస్తున్న సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు శనివారం సాయంత్రం కొత్తపల్లి పంచాయతీ ఆర్.బి.కే నందు సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్ర రెడ్డి అధ్యక్షతన, పంచాయతీ సెక్రెటరీ నరసింహులు పలు కీలక సూచనలు చేశారు. పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతన నిర్మాణాలు చేపడుతున్న దృష్ట్యా, పంచాయతీకి పురోగతికి పన్నుల వసూళ్లు ముఖ్య భూమిక పోషిస్తాయని, ఇందులో ప్రధానంగా ఇంటి పన్నుల వసూళ్లు, నూతన నిర్మాణాల కొరకు లబ్ధిదారులు బ్యాంకు రుణాల కొరకు ఖాతాలు తెరుచుట, ఆయుష్మాన్ భారత్ సర్వేలపై సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ద్రుష్టి సారించాలని, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారికి సూచనలు సలహాలు ఇవ్వాలని, లబ్ద్ధిదారుల ఎంపికలో పారదర్సకంగా వ్యవహరించాలని కోరారు. అనంతరం సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల పనితీరుపై నివేదిక తీసుకున్నారు. పై పేర్కొన్న ప్రతి అంశముపై పంచాయతీలోని సచివాలయాల యందు తప్పక నివేదికలు పొందుపరిచి లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చాలని ఈ సందర్భంగా వారు కోరారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page