top of page

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం - సచివాలయ సిబ్బంది

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 4, 2022
  • 1 min read

వై.ఎస్.అర్ జిల్లా, ప్రొద్దుటూరు


కొత్తపల్లె పంచాయతి కార్యాలయంలో సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి, పంచాయతి సెక్రటరీ పుల్లారెడ్డి అధ్యక్షతన నేడు సచివాలయ సిబ్బంది రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పంచాయతి పరిధిలోని అయిదు సచివాలయాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సచివాలయం వ్యవస్థను 2019 అక్టోబర్ లో ప్రవేశ పెట్టగా, 2022 జూలై ఒకటవ తేదీ నుండి సిబ్బందిని ప్రభుత్వోద్యోగులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా పలువురు సచివాలయం సిబ్బంది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి మాట్లాడుతూ, ముందుగా సచివాలయ సిబ్బందిని అభినందించారు, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటరీ సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రజలకు చేరువగా ప్రభుత్వ పథకాలు అమలుకు కృషి చేస్తున్న తీరును అభినందించారు. రాబోవు రోజుల్లో పంచాయతి పరిధిలోని సచివాలయ సిబ్బంది ప్రజలకు మరింత చేరువై ప్రభుత్వ పథకాలు అమలుకు కృషి చేసి పంచాయతీకి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, సర్పంచ్ కొనిరెడ్డి, సెక్రెటరీ పుల్లారెడ్డి, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page