top of page

పంచాయతీ నిధులతో మంచినీటి పైప్ లైన్ పనులు ప్రారంభం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 11, 2022
  • 1 min read

Advertisement : ప్రొద్దుటూరులో ఇంటి స్థలాలు / ఫ్లాట్స్ అమ్మాలన్నా కొనుగోలు చేయాలన్నా సంప్రదించండి - 9912324365

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు

కొత్తపల్లె పంచాయతి పరిధిలోని నీలాపురం గ్రామంలో నేడు ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో మంచినీటి పైప్ లైన్ పనులకు సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో నేడు పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పనులలో భాగంగా నేడు నీలాపురం గ్రామంలో ఇరవై ఐదు లక్షల పంచాయతీ నిధులతో ఇక్కడ మంచినీటి త్రాగునీటి సౌకర్యాల ఏర్పాటు కొరకు పనులు ప్రారంభించామని, అభివృద్ధి పధంలో కొత్తపల్లె పంచాయతీ ముందుకు దూసుకెళుతోందని, వివిధ వర్గాల ప్రజలు ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న కారణంగా, రాబోవు కాలంలో మంచినీటికి అసౌకర్యం కలుగాకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

అనంతరం కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని ప్రకాష్ నగర్, మూడవ వీధిలోని అంగన్వాడీ (1) కేంద్రాన్ని ఆయన సందర్శించారు. తల్లులకు, పిల్లలకు పౌషికాహారం అందించటంలో ఏ మాత్రం జాప్యం జరిగినా ఉపేక్షించేది లేదని అక్కడి అంగన్వాడీ కార్యకర్తకు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పధకాలను ప్రజలకు చేరువ చేయటంలో నాయకులు, అధికారులు ముందుండాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు స్వయానా భోజనం వడ్డించి, తల్లులకు అంగన్వాడీ కేంద్రం ద్వారా అందుతోన్న బియ్యం, కోడి గ్రుడ్డు, పాలు, కంది బేడలు, బాలామృతం, రాగి పిండి, జొన్న పిండి పంచిపెట్టారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page