top of page

కూటమి హయంలో అభివృద్ధి వైపు కొత్తపల్లె పంచాయతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 6, 2024
  • 1 min read

కూటమి హయంలో అభివృద్ధి వైపు కొత్తపల్లె పంచాయతి

వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


కూటమి హయాంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తోంది. వివరాల్లోకి వెళితే, వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లె పంచాయతీ నందు గల డిసిఎస్ఆర్ లాడ్జి నుండి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు కోటి 25 లక్షల వ్యయంతో మురుగు కాలువ, 100 అడుగుల రహదారి, డివైడర్ల పునరుద్దరణకు బుధవారం ఉదయం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్ ముక్తియర్ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరద మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ప్రొద్దుటూరు అభివృద్ధి పథంలో నడుస్తోందని, రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి వాసవి సర్కిల్ వరకు ఫోర్ లైన్ రహదారి కూడా టెండర్లు పిలిచామని త్వరగా పని మొదలుపెట్టి పూర్తి చేస్తామని, అలాగే నియోజకవర్గంలోని రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా మొదలుపెట్టామని, కూటమి హయాంలో ఇప్పటికే నియోజకవర్గానికి దాదాపుగా 25 కోట్ల రూపాయల రుణాలు అభివృద్ధికి తెప్పించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు మెంబర్ కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, తహసిల్దార్ గంగయ్య, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు బద్వేలి శ్రీనివాసులు రెడ్డి, పీకాక్ బార్ సుబ్బారెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page