top of page

కోతపల్లె గ్రామంలో పంచాయతి పల్లెబాట

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 30, 2022
  • 1 min read

వై. ఎస్ ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు మండలం, కొత్తపల్లె పంచాయతి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డికి ఆదివారం సాయంత్రం కొత్తపల్లె గ్రామంలో నిర్వహించిన పంచాయతీ పల్లె బాట కార్యక్రమంలో సాదర స్వాగతం లభించింది. వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అడుగడుగునా బాణాసంచా పేలుస్తూ పూలవర్షం కురిపిస్తూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. గత కొద్ది వారాలుగా కొత్తపల్లె పంచాయతీ పరిధిలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న పంచాయతీ పల్లెబాట కార్యక్రమం ఈ ఆదివారం సాయంత్రం కొత్తపల్లె గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి గ్రామంలోని ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు, ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ పధకాలు, మౌలిక వసతులు గురించి అడిగి తెలుసుకొని, సమస్యలు గుర్తించి వాటి సత్వర పరిష్కారానికి కృషి చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఒకటిన్నర సంవత్సర కాలంలో కొత్తపల్లె పంచాయతీలో అభివృద్ధి పనులు మెండుగా చేపట్టామని, ప్రజలు తనపై చూపిస్తున్న ఈ ఆదరాభిమానాలకు తాను ఎల్లవేళలా కృతజ్ఞుడినని, అత్యధిక మెజారిటీతో తనను కొత్తపల్లె గ్రామ ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. గతంలో కొత్తపల్లెలో మంచినీటి సమస్య అధికంగా ఉండేదని కాగా గడచినా ఒకటిన్నర సంవత్సర కాలంలో నూతన పైప్ లైన్లు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నామని అన్నారు. సమస్యలను అధిగమించటానికి తాము తమ ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పలువురు వార్డు మెంబర్లు, కొనిరెడ్డి అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, కొత్తపల్లె గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page