top of page

టీడీపీలోకి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 24, 2023
  • 1 min read

టీడీపీలోకి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి...

నెల్లూరు : వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి నేడు టీడీపీలో చేరబోతున్నారు..

మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరబోతున్నట్టు ఆయన చెప్పారు. అందరూ తరలివచ్చి తనకు మద్దతు తెలపాలని కోరారు. టీడీపీలో చేరుతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు, లోకేశ్ ఫొటోలున్న ఫ్లెక్సీలను నగరంలో ఏర్పాటు చేశారు..

ఉదయం నెల్లూరులో భారీ ప్రదర్శన అనంతరం తాడేపల్లికి వెళ్లి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటారు. గిరిధర్‌రెడ్డితో పాటు మరి కొందరు నేతలు కూడా పార్టీలో చేరుతారు. వైసీపీ నేత అయిన గిరిధర్‌రెడ్డి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆయన సోదరుడైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పుతూ రెబల్‌గా మారారు. ఆయన కూడా పార్టీని వీడి టీడీపీలో చేరబోతున్నారన్న ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page