top of page

ముఖ్యమంత్రిని కలిసిన సర్పంచ్ కొనిరెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 27, 2023
  • 1 min read

కొనిరెడ్డికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

కొనిరెడ్డి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

విజయవాడ, వైఎస్సార్‌ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్‌ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రిని అసెంబ్లీ ప్రాంగణంలో శివచంద్రారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న శివచంద్రారెడ్డిని ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేశారు. అలాగే కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని సమస్యలతో పాటు పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొనిరెడ్డి జిల్లాలోని సర్పంచుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి తనతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడి యోగ క్షేమాలు తెలుసుకోవడం పట్ల శివచంద్రారెడ్డి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా కొనిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలవటం పట్ల సర్వత్ర ఆసక్తి నెలకొంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page