top of page

కొనిరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 27, 2022
  • 1 min read

వై.ఎస్.అర్ జిల్లా, ప్రొద్దుటూరు

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పుట్టనరోజు సందర్భంగా నియోజకవర్గం లోని వైసీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, కొత్త పల్లె పంచాయతీ సర్పంచ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివ చంద్రా రెడ్డి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు ప్రయాణికుల సౌకర్యర్థం చల్లటి త్రాగునీరు సేవించుటకు రెండు ఫ్రిడ్జ్ లు వితరణ చేశారు. ప్రొద్దుటూరు ఆర్టీసీ డీఎం మధుకర్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో, కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి కుమార్తె హిమజా తన చేతుల మీదుగా చల్లనీటి ఫ్రిడ్జ్ లు ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, కొనిరెడ్డి రామచంద్రా రెడ్డి, కొనిరెడ్డి ఎల్లమ్మ గార్ల జ్ఞాపకార్థం, నేడు వైఎస్ అవినాష్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా తమ ఫౌండేషన్ తరపున ఫ్రిడ్జ్ లను వితరణ చేశామని, వైఎస్ అవినాష్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని, అటు పార్టీలోని నాయకులకు ఇటు ప్రజలకు అందుబాటులో ఉంటూ, మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆయన కోరారు.

కార్యక్రమంలో కొనిరెడ్డి ఫౌండేషన్ సభ్యులు, ఆర్టీసీ డియం మధుకర్ రెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్ ఖాజా, కౌన్సిలర్లు మున్వర్, గౌస్, మురళి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దయెత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page