top of page

కవి కోకిల కవితా గానం - కొనిరెడ్డి ఫౌండేషన్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 21, 2023
  • 1 min read

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కవి కోకిల కవితా గానాన్ని ఉగాది సందర్భంగా బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు, కొఱ్ఱపాడు రోడ్డులోని కొనిరెడ్డి ఆయిల్ మిల్ నందు ఏర్పాటు చేయడం జరిగిందని కొనిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తెలియచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కొనిరెడ్డి ఆయిల్ మిల్ నందు ఉగాది కవి సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా నలుమూలల నుండి దాదాపు 50 మంది కవులకు సన్మానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఉగాది పంచాంగ శ్రవణం చేయనున్నట్లు, కావున పట్టణ ప్రజలు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు. కార్యక్రమంలో ప్రఖ్యాత కవి నరాల రామిరెడ్డి, చదువుల బాబు తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page