కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూత
- VOICE OF HERALD

- Feb 28, 2022
- 1 min read

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ అమృత నగర్ 23వ వీధిలో ఉన్న షేక్ పెద్దవలి కూలి పని చేస్తూ జీవనం సాగించేవారు, ఈయనకు కొన్ని రోజుల నుండి వెన్నెముక సమస్యతో బాధ పడుతూ ఉండేవాడు, ఈయన భార్య అయినటువంటి షేక్ మెహతాబ్ గారు కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొని రెడ్డి శివ చంద్రారెడ్డి ని కలవడం జరిగింది, ఆయన షేక్ పెద్దపల్లి వెన్నెముక ఆపరేషన్ కొరకు సుమారు ఒక లక్ష రూపాయల వరకూ కావలసి ఉంటుందని షేక మెహతాబ్ తెలియజేయగా ఆయన మానవత్వం చాటుకుని ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం 30 వేల రూపాయలు షేక్ మెహతాబ్ గారికి అందజేయడం జరిగింది, వారికి సంబంధించిన మెడిసిన్స్ కొరకు వాటి ఖర్చుల కొరకు మేము ఎంతవరకైనా ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొని రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, టి. ప్రభాకర్ నాయుడు పాల్గొన్నారు



Comments